Polity and Governance |
---|
|
ఎందుకు వార్తల్లో ఉంది?
ఇంటర్మీడియట్ విద్యా బోర్డు (BIE) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బోర్డు పరీక్షలను తొలగించడం, 2025-26 నుంచి NCERT పాఠ్యపుస్తకాలకు మార్పును ప్రతిపాదించింది. ఈ సంస్కరణలు విద్యార్థుల ఒత్తిడి తగ్గించడమే కాకుండా, JEE, NEET వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలతో విద్యా వ్యవస్థను అనుసంధానం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ముఖ్యాంశాలు: మొదటి సంవత్సరం బోర్డు పరీక్షల తొలగింపు: విద్యార్థుల ఒత్తిడి తగ్గించేందుకు, ఇతర బోర్డులతో సమన్వయం చేసేందుకు మొదటి సంవత్సరం పరీక్షలు బోర్డు నిర్వహించకుండా, కళాశాలలు అంతర్గతంగా నిర్వహిస్తాయి. బోర్డు పరీక్షలు రెండవ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఉంటాయి. అభ్యాస ఫలితాలపై దృష్టి: సిలబస్‌ను సంక్షిప్తంగా, ఫలితాలపై ఆధారపడిన విధంగా రూపొందిస్తారు, దీని ద్వారా విద్యార్థులు లోతైన అవగాహన పొందేలా ప్రోత్సహిస్తారు. NCERT పాఠ్యపుస్తకాలకు మార్పు: 2025-26 విద్యా సంవత్సరంలో NCERT పాఠ్యపుస్తకాలను అమలు చేస్తారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలతో (JEE, NEET) సాఫల్యంగా సమన్వయం కలుగుతుంది. కొత్త సబ్జెక్టు కాంబినేషన్లు: విద్యార్థులకు విస్తృతమైన ఎంపికలతో సబ్జెక్టు కాంబినేషన్లు అందుబాటులో ఉంటాయి. ఇంగ్లిష్ తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుంది, విద్యార్థులకు తమ అభిరుచికి అనుగుణంగా ఎంపికల అవకాశం ఉంటుంది. MBiPC వంటి ప్రామాణిక కొత్త కోర్సులు, 26 కళల విభాగ కాంబినేషన్లు అందిస్తారు. పరీక్షా నమూనాలో మార్పులు: పరీక్షా నమూనా సిద్ధాంతం (70-80%) మరియు అంతర్గత/ప్రాక్టికల్ అంచనాల (20-30%)పై సమాన దృష్టి పెట్టేలా పునర్వ్యవస్థీకరించబడుతుంది. ఎంపికా ప్రశ్నలు (MCQs), ఖాళీలు పూరించు ప్రశ్నలు ప్రవేశపెట్టబడతాయి, ఇది విస్తృత నైపుణ్యాల అంచనాను కలిగిస్తుంది. వ్యాసాలకు కేటాయించిన వెయిటేజీ తగ్గించబడుతుంది, కాంపాక్ట్ రైటింగ్‌ను ప్రోత్సహించబడుతుంది. |
|
ENGLISH
AP Board of Intermediate Education proposes major reformsWhy in the news? The Board of Intermediate Education (BIE) has proposed significant reforms, including the removal of board exams for first-year Intermediate students and transitioning to NCERT textbooks from 2025-26. These changes aim to reduce stress on students and align the education system with national standards for competitive exams like JEE and NEET. Key Takeaways: Removal of Board Exams for First Year: To reduce student stress and align with other boards, the BIE proposes handling first-year exams internally and holding board exams only for the second year. Focus on Learning Outcomes: The syllabus will shift towards a more concise and outcome-based approach, encouraging deeper understanding and engagement. Transition to NCERT Textbooks: From the academic year 2025-26, NCERT textbooks will be implemented to ensure seamless progression and better alignment with national competitive exams like JEE and NEET. New Subject Combinations: A wider range of flexible subject combinations will be offered, including English as a compulsory subject and a choice of electives. Additionally, innovative courses like MBiPc and a broader selection of humanities combinations are proposed. Changed Exam Pattern: The exam pattern will be revised to emphasize both theory (70-80%) and internal/practical assessments (20-30%). Objective questions like MCQs and fill-in-the-blanks will be introduced for broader skill assessment. Essay weightage will be reduced, encouraging concise writing. |
>> More APPSC Current Affairs |